Social 1080×1350 • Multi-page
18-01-2025 BREAKING NEWS 05:43 PM
swarnodayam.com
Telugu Daily News

పివి విగ్రహ ఏర్పాటుకు సహాకరించాలని కలెక్టర్ కు వినతి

పివి విగ్రహ ఏర్పాటుకు సహాకరించాలని కలెక్టర్ కు వినతి
IMG_20250118_174130

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన పివి సేవాసమితి వారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి.. పివి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పివి విగ్రహానికి సహకరించాలని వినతి పత్రాన్ని శుక్రవారం సమర్పించారు. సమితి అధ్యక్షుడు తూము వెంకటరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం గర్వించ దగ్గ మేధావి పీవీ అని భారతరత్న, నేటి వర్తమాన భవిష్యత్తు నాయకులకు స్ఫూర్తి ప్రదాత అని, మాజీ ప్రధాని పివి ఈ దేశానికి అందించిన సేవలను గుర్తుచేశారు. పివి సేవాసమితి పట్టణంలో నిర్వహించే ఈ మహాత్తర పివి విగ్రహ ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజాసంఘాలు సహకరించాలి కోరారు. మన తెలుగు బిడ్డగా మనం గౌరవించు కోవలసిన అవసరం ఉంది అని అన్నారు. విగ్రహ ఏర్పాటుకు తమ సహకారం ఉంటుందని సుముఖత వ్యక్తం చేసిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ కి ఈ ప్రాంత పివి అభిమానులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వారు చెప్పారు.
అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!