Social 1080×1350 • Multi-page
19-01-2025 BREAKING NEWS 06:33 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం
Oplus_131072

–23 ఎళ్ళ తర్వాత ఏకమైన పూర్వ విద్యార్థులు…

–ఉపాధ్యాయులతో పంచుకున్న చిన్ననాటి జ్ఞాపకాలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో 23ఏళ్ళ తర్వాత ఏకమైన పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఒక్కచోట కలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హుజూరాబాద్ మండల కేంద్రంలోని ఉషోదయ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఆధ్యాంతం ఆకట్టుకుంది. 2001-02 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు తమకు పాఠశాల స్థాయిలో విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. బాల్య మిత్రులతో అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రెండు దశాబ్దాల తర్వాత అందరూ ఒక్కచోట కలవడం పట్ల పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఆనంతరం నాటి ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు జ్ఞాపికలు అందజేసి, శాలువాలతో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా నాడు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు మాట్లాడుతూ పాఠశాలలలో చదివిన ఎందరో విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నందుకు గర్వపడుతున్నామని అన్నారు. ప్రతి ఓక్కరు దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు మండల వీరస్వామి, చిలుకమారి సత్యరాజ్, గౌటం గోపాల్, గునిగంటి శ్రీనివాస్, మరియు 35 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళ నిర్వహాణకు కృషిచేసిన పూర్వ విద్యార్థులు నాగుల విక్రమ్, డాక్టర్ ఉమేష్, కుమార్ లను పలువురు అభినందించారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!