19-01-2025 NORMAL NEWS 09:11 PM
swarnodayam.com
Telugu Daily News
19-01-2025 09:11 PM By Mandala Yadagiri

క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి. -మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక -శ్రీనివాస్

క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి. -మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక -శ్రీనివాస్
IMG_20250119_210759

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఆదివారం అండర్ 16 కబడ్డీ పోటీలు స్థానిక హై స్కూల్ క్రీడామైదానంలో ఉత్కంఠ భరితంగా పోటీలు సాగాయి బాలికల విభాగంలో 16 జట్లు పాల్గొన్నాయి. బాలుర విభాగంలో 22 జట్లు పాల్గొన్నాయి.
హుజురాబాద్ వర్సెస్ బాలికల భాగంలో కరీంనగర్, హుజురాబాద్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హుజురాబాద్ పై కరీంనగర్ విజయం సాధించింది. బాలుర విభాగంలో హుజురాబాద్ వర్సెస్ కరీంనగర్ జట్ల మధ్య ఫైనల్ జరుగగా కరీంనగర్ జట్టు 41 పాయింట్లు సాధించగా హుజురాబాద్ జట్టు 61. సాధించి 20 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. బహుమతులు ప్రధానం చేసిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ…చదువుతోపాటు క్రీడలు ఎంతో గాను ఉపయోగపడతాయని, దేహ దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలని, క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని క్రీడాకారులకు సూచించారు. హుజురాబాద్ క్రీడాకారులకు నిలయమని అలాంటి హుజూరాబాద్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యంరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్, నిర్వాహకులు కాల్వ సునీల్ రెడ్డి, నీరటి రమేష్, రవీందర్, వి రవీందర్రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!