Social 1080×1350 • Multi-page
20-01-2025 BREAKING NEWS 06:26 PM
swarnodayam.com
Telugu Daily News

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు.! -హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరుపతి

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు.! -హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరుపతి
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయనీ ఎవ్వరూ అధైర్యపడవద్దు అని హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరుపతి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అయిన ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు మొదలైనవి అందుతాయనీ హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరుపతి తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధికి మారు పేరుగా రేవంత్ రెడ్డి సర్కారు పని చేస్తుంది అని అన్నారు. కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అలాంటి మాటలు ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకున్నా, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, రాజపల్లి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవుల సురేష్, నాయకుడు ఈరెల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!