Social 1080×1350 • Multi-page
20-01-2025 BREAKING NEWS 11:22 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా కౌన్సిలర్ తిరుమల్ రెడ్డి కుమారుడు రిక్కి జన్మదిన వేడుకలు..ప్రభుత్వాస్పత్రి ఆవరణలో అన్నదానం

ఘనంగా కౌన్సిలర్ తిరుమల్ రెడ్డి కుమారుడు రిక్కి జన్మదిన వేడుకలు..ప్రభుత్వాస్పత్రి ఆవరణలో అన్నదానం
IMG_20250120_232001

మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జవనరి 20 : పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్ ప్రతాప తిరుమల్ రెడ్డి కుమారుడు శ్రీచరణ్ (రిక్కి) జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నాడు. పలువురు ప్రజాప్రతినిధులు, తిరుమల్ రెడ్డి స్నేహితులు రిక్కికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. రిక్కి జన్మదినం సందర్భంగా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో సుమారు 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్బంగా పలువురు రిక్కిని అభినందిస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఇలాగే సామాజిక కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప రాజు, ప్రతాప శ్రీనివాస్, వేణు, సుధాకర్, మనోహర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!