21-01-2025 NORMAL NEWS 11:42 PM
swarnodayam.com
Telugu Daily News
21-01-2025 11:42 PM By Mandala Yadagiri

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విమానాశ్రయంలో ఘన స్వాగతం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విమానాశ్రయంలో ఘన స్వాగతం
IMG_20250121_234035

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.

ముఖ్యమంత్రి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ స్థిరపడిన తెలుగు వారితో సందడి నెలకొంది. ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున హాజరై అభినందనలు తెలియజేశారు.

జ్యూరిచ్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పరం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై వారి మధ్య క్లుప్తంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు.

దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి గారు సమావేశమవుతారు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్య స్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో ఈ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!