Social 1080×1350 • Multi-page
22-01-2025 BREAKING NEWS 06:16 PM
swarnodayam.com
Telugu Daily News

చేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ ఓ

చేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ ఓ
IMG_20250122_181425

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను తనిఖీ చేసి సాధారణ ప్రసవాలు జరిగేలా సిబ్బంది కృషి చేయాలని చెప్పారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, రోగుల సంఖ్య పెంచాలని, అందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అసంక్రమిక వ్యాధులైన బిపి, డయాబెటిస్ వ్యాధులకు సకాలంలో పరీక్షలు చేసి వైద్య చికిత్సలు అందించాలని కోరారు. ఓరల్ క్యాన్సర్స్ గుర్తించి సకాలంలో చికిత్స జరిగేలా చూడాలని చెప్పారు. అన్ని వైద్య ఆరోగ్య కార్యక్రమాలు అన్నిటిని అమలు చేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేలా చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యామ్, డివిజన్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మధు సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!