Social 1080×1350 • Multi-page
22-01-2025 BREAKING NEWS 07:04 PM
swarnodayam.com
Telugu Daily News

వాసవి వనిత క్వీన్స్ క్లబ్ మరియు వాసవి గ్రేటర్ మెన్స్ క్లబ్ లో ఎన్నిక-ప్రమాణ స్వీకారం

వాసవి వనిత క్వీన్స్ క్లబ్ మరియు వాసవి గ్రేటర్ మెన్స్ క్లబ్ లో ఎన్నిక-ప్రమాణ స్వీకారం
IMG_20250122_185752

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వాసవి వనిత క్వీన్స్ క్లబ్ మరియు వాసవి గ్రేటర్ మెన్స్ క్లబ్ హుజూరాబాద్ వారి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నుకోవడంతోపాటు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ నుండి గవర్నర్ ఇల్లందుల కిషోర్, ముక్కా శ్రీనివాస్, తంగళ్లపల్లి రాజభాస్కర్, పవిత్రం శ్రీనివాస్, కొనుకుముట్టి వెంకటేష్, పుల్లూరి బాల మోహన్, అఖిన్నపల్లి శ్రీనివాస్, యాంసాని రమేష్, రావికంటి నీలకంఠం, జైన అర్చన, ఎల్లంకి ప్రదీప్, రావికంటి మధుబాబు, గంప సురేందర్, నూక కృష్ణ, అలాగే రీజియన్ చైర్ పర్సన్ అయిత రమా దేవి, జోనల్ చైర్ పర్సన్ నంగునూరి శైలజ వచ్చారు. వారి చేతుల మీదుగా క్వీన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా నార్ల అర్చన, సెక్రటరీగా శివనాథుని స్వప్న, ట్రెజరర్ గా చీకోటి త్రివేణినిలను ఎన్నుకోవడం జరిగింది. అలాగే వాసవి మెన్స్ గ్రేటర్ క్లబ్ హుజురాబాద్ ప్రెసిడెంట్ గా అఖినపల్లి శ్రావణ్, సెక్రటరీగా చిదురాల నాగరాజు, ట్రెజరర్ గా దేవునూరి సాయితేజ ని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ గందె రాధిక, మరియు పట్టణ ఆర్య వైశ్య అధ్యక్షులు హరిశంకర్ సుద్దాల పాల్గొన్నారు. ఇందులో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. అలాగే పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఆర్యవైశ్యలు సమాజ సేవ కోసం ముందుండి తమ సేవలు అందివ్వడంలో ముందు ఉంటారని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని వారు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

నూతన కమిటీలతో ప్రమాణస్వీకారం చేస్తున్న గవర్నర్

Oplus_131072

ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్యవైశ్య కులస్తులు.. వివిధ ఆర్యవైశ్య అనుబంధ సంఘాల నాయకులు, సభ్యులు,

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!