Social 1080×1350 • Multi-page
22-01-2025 BREAKING NEWS 10:07 PM
swarnodayam.com
Telugu Daily News

లిస్టులలో పేర్లు రాలేదని ఆందోళన చెందవద్దు.. -కాంగ్రెస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు యేముల పుష్పలత

లిస్టులలో పేర్లు రాలేదని ఆందోళన చెందవద్దు.. -కాంగ్రెస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు యేముల పుష్పలత
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన వార్డుసభలలో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల పుష్పలత స్పష్టం చేశారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ కాలనీలో నిన్నటి రోజున ప్రకటించినటువంటి లిస్టులలో రేషన్ కార్డులు, పేర్లు రాలేదని ఆందోళన చెందవద్దు అని నేడు వారి నుండి తిరిగి దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు.
అర్హులైన వారికే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలాగా మళ్ళీ అధికారులు సర్వే చేస్తారన్నారు. ఈ విషయాన్ని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ దృష్టికి తీసుకొని వెళ్లానని, అర్హులైన వారికి కచ్చితంగా వచ్చే విధంగా అధికారులతో మాట్లాడతానని ఆయన
చెప్పారన్నారు.

Oplus_131072 అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న వార్డు ప్రత్యేక అధికారి రాములు నాయకురాలు పుష్పలత

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!