Social 1080×1350 • Multi-page
23-01-2025 BREAKING NEWS 09:51 AM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ బాల రాముడి చిత్రపటం వద్ద ప్రసాద వితరణ

శ్రీ బాల రాముడి చిత్రపటం వద్ద ప్రసాద వితరణ
IMG_20250123_094827

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిజెపి నాయకుడు అంకతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది అయిన సందర్భంగా బుధవారం రోజున శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచ అమృత అభిషేకము, తీర్థప్రసాద వినియోగము మరియు అంబేద్కర్ కూడలి నందు శ్రీ బాల రాముడి చిత్రపటం వద్ద ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు పిట్ట నరసింగం, తూర్పాటి రాజు, గంగిశెట్టి రాజు, రావుల వేణు, కోలిపాక శ్రీనివాస్, నరాల రాజశేఖర్, తిప్పపతిని రాజు, యాట రాజేష్ ఖన్నా, బీమోజ్ వెంకట్, కుసుమ సమ్మయ్య, తాళ్లపల్లి దేవేంద్ర, తాళ్లపెళ్లి హరీష్, పుల్లూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!