Social 1080×1350 • Multi-page
23-01-2025 BREAKING NEWS 12:44 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో బీసీ ఆజాది సైకిల్ యాత్ర …. జెండా ఊపి ప్రారంభించిన జక్కని సంజయ్ బీసీల ఐక్యతతో పోరాడుతాము.. -బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్.

హుజురాబాద్ లో బీసీ ఆజాది సైకిల్ యాత్ర …. జెండా ఊపి ప్రారంభించిన జక్కని సంజయ్ బీసీల ఐక్యతతో పోరాడుతాము.. -బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్.
IMG_20250123_124147

– అడ్డగా ఉన్న హుజురాబాద్ గడ్డలో దొరల పాలన కులుస్తాం.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీల ఐక్యతతో హక్కుల సాధన కోసం పోరాడుతామని, నిర్విరామ పోరాటంతో రాజ్యాధికారాన్ని సాధిస్తామని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. బీసీ ఆజది సైకిల్ యాత్రను ఈ రోజు గురువారం హుజురాబాద్ లో జక్కని సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్ లు హాజరై మాట్లాడారు. జనాభాలో దాదాపు సగా భాగమైన బీసీలము, అన్ని రంగాలలో వెనకబడి ఉన్నామని పన్నులు కట్టి దేశాన్ని నడిపే బీసీలము అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని యాచించే స్థాయి నుంచి పాలించే స్థాయికి రావాలని ఆ పాలన కోసం బీసీలకు చట్టసభల్లో కూచోబెట్టి ఈ దేశాన్ని పాలించినపుడే దేశ స్థితి గతులు మారతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సైకిల్ యాత్ర సాధకులు బత్తుల సిద్ధేశ్వర్, చాపర్తి కుమార్ గాడ్గేలు మాట్లాడుతూ ఈ కార్యక్రమం బీసీలను ఐక్యం చేయుటకు ఏర్పాటు చేశామని తెలిపారు.

బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రావుల రాజేష్, జిల్లా కన్వీనర్ చిలుకమరి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు తాడూరి మల్లేష్, అసెంబ్లీ అధ్యక్షులు పంజల తిరుపతి గౌడ్, మండల అధ్యక్షులు పెరుమాండ్ల కోటేశ్వర్ గౌడ్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంగర నరహరిమాల, పర్వత సతీష్, విజయ్ కుమార్ మాదిగ, మోహన్ రెడ్డి, చంద్రయ్య మాదిగ, మూర్తి, వెంకటేష్, సుధాకర్, జహంగీర్, జయ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

జండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభిస్తున్న జక్కని సంజయ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!