23-01-2025 NORMAL NEWS 06:37 PM
swarnodayam.com
Telugu Daily News
23-01-2025 06:37 PM By Mandala Yadagiri

గుండెపోటుతో జిల్లా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆకస్మిక మృతి

గుండెపోటుతో జిల్లా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆకస్మిక మృతి
IMG_20250123_183245

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణించిన విషయం తెలియగానే జిల్లా కేంద్రంలోని అపోలో హాస్పిటల్లో వారి పార్థివదేహానికి మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు డా. కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతదేహాన్ని సందర్శించిన వారిలో మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డివో మహేశ్వర్, కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

ఈఈ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ, కలెక్టర్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!