Social 1080×1350 • Multi-page
24-01-2025 BREAKING NEWS 10:38 AM
swarnodayam.com
Telugu Daily News

మద్యానికి బానిసైన వ్యక్తి హై స్కూల్ మైదానం వద్ద మృతి.

మద్యానికి బానిసైన వ్యక్తి హై స్కూల్ మైదానం వద్ద మృతి.
IMG_20250124_103142

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానం వద్ద ఓ వ్యక్తి మద్యానికి బానిసై మృతి చెందారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ కు చెందిన సోయం రాజు 36 గత కొన్నాళ్లుగా భార్యా పిల్లలను పట్టించుకోకుండా మద్యానికి బానిసై దొరికిన కడల్ల అడుక్కుంటూ నిత్యం తాగుతుండేవాడు. దీంతో భార్య శిరీష ఇద్దరు కొడుకులను, కూతురును కూలి నాలి పనులు చేస్తూ పోషించేది. రాజు మద్యానికి బానిస కావడంతో అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేదని తెలిపారు. రాత్రి హైస్కూల్ క్రీడా మైదానం పక్కన నూతనముగా నిర్మిస్తున్న కబడ్డీ క్రీడా భవనం వద్ద నిద్రిస్తూ మృతి చెంది ఉన్నాడు. ఉదయం వాకింగ్ కు వెళ్లన పలువురు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే మృతుడు చనిపోయిన వద్ద కొద్ది దూరంలో రక్తం మరకలు ఉండడం, నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉండడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేయగా.. పోలీసులు మాత్రం ఫిట్స్ వ్యాధితో చనిపోయిన వ్యక్తికి సాధారణంగా అలా రక్తం కారుతుందని తెలిపారు. తన భర్త మృతి పై తనకు ఎలాంటి అనుమానం లేదని, అతనికి మతిస్థిమితం సరిగా ఉండేది కాదని అతని భార్య శిరీష ఫిట్స్ వ్యాధితోనే చనిపోయినట్లు దరఖాస్తు రాసి ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Oplus_131072 మృతి చెందిన రాజు
Oplus_131072 సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, వాకర్స్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!