Social 1080×1350 • Multi-page
24-01-2025 BREAKING NEWS 09:53 PM
swarnodayam.com
Telugu Daily News

ముమ్మరంగా బడి బయట పిల్లల సర్వే.. -బడి ఈడు పిల్లలు బడిలోనే.!

ముమ్మరంగా బడి బయట పిల్లల సర్వే.. -బడి ఈడు పిల్లలు బడిలోనే.!
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలనే సదుద్దేశంతో ఈనెల 10 నుంచి ప్రారంభమైన బడి బయట పిల్లల సర్వే ఈనెల 25తో ముగియనుంది. ఈ కార్యక్రమం జిల్లాలో బడి బయట పిల్లల సర్వే విజయవంతంగా కొనసాగుతుంది. క్షేత్రస్థాయిలో హుజురాబాద్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో సి ఆర్ పి లు సర్వేను నిర్వహిస్తూ బడిబాట పిల్లలను, వలస కార్మికుల పిల్లలను ఇప్పటివరకు 10 మందిని గుర్తించి సమీప పాఠశాలలో ప్రవేశాన్ని కల్పించడం జరిగింది.
– ప్రత్యేక అవగాహన..
బడి బయటి పిల్లల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో డీఈవో, సెక్టోరల్ అధికారులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సిఆర్పిలకు, ఐఆర్పిలకు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లకు, సీసీఓలకు, వాళ్లకు ప్రత్యేక అవగాహన కల్పించారు. రాష్ట్రస్థాయి అధికారులు సర్వేలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితులలో బడి బయట పిల్లలు ఒక్కరు కూడా మిగలకుండా నిక్కచ్చిగా సర్వేను నిర్వహించాలని సూచించారు.
–సిఆర్పిలే కీలకం..
బడి బయటి పిల్లలను గుర్తించడమే కాదు వారిని బడిలో చేర్పించాల్సిన బాధ్యత కూడా సిఆర్పిలపై ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సర్వేలో గుర్తించిన పిల్లలను బడిలో చేర్పించడం జరిగింది. వరుసగా 30 రోజులు హాజరుకాని విద్యార్థులను గుర్తించి తిరిగి బడికి హాజరయ్యేలా చేస్తున్నారు. గుర్తించిన పిల్లల్లో పాఠశాల వయస్సు వారిని తగిన తరగతిలో సమీప పాఠశాలలో లేదా యుఆర్ఎస్ లో నమోదు చేసే అవకాశాన్ని కల్పించారు. జిల్లాలో ఆరు నుంచి 14 ఏళ్ల పిల్లలను బడిలో చేర్పించగా సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థుల్లో కొందరికి ఓపెన్ స్కూల్ ఇంటర్లో ప్రవేశం కల్పించారు.
–ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు..
పోరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కుటుంబంలోని పిల్లలకు చదువు నేర్పించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సర్వేలో ఇటుక బట్టీలు, భవన నిర్మాణం, కులవృత్తులు తదితర సంఘాల్లో తల్లిదండ్రులతో కలిసి పని చేసే వారిని గుర్తించనున్నారు. 6 -14 ఏళ్ల వారు ఒకే చోట పదిమంది పిల్లలు ఉంటే తాత్కాలికంగా సమీపంలో నాన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక విద్య వాలంటీర్లను నియమించి మూడు నుంచి ఆరు నెలల పాటు ఆయా రాష్ట్రలా భాషతోపాటు తో పాటు తెలుగు నేర్పించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఆ తర్వాత పిల్లలను కేజీబీవీ, ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పిస్తారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్ర పరిధి విద్యాశాఖలో పనిచేస్తున్న ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, ఐఆర్పిలు గ్రామంలోని ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగుతుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!