25-01-2025 NORMAL NEWS 08:12 PM
swarnodayam.com
Telugu Daily News
25-01-2025 08:12 PM By Mandala Yadagiri

ఉపన్యాస పోటీలో పెద్దపాపయ్యపల్లి పాఠశాల విద్యార్థినికి ప్రథమ బహుమతి

ఉపన్యాస పోటీలో పెద్దపాపయ్యపల్లి పాఠశాల విద్యార్థినికి ప్రథమ బహుమతి
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు హుజురాబాద్ మండలంలోని ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండల స్థాయిలో ఈ నెల 23న హుజురాబాద్ మండల విద్యా వనరుల కేంద్రంలో విద్యార్థులకు ఉపన్యాస మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ‘ప్రజాస్వామ్యం మరియు ఓటర్ల భాగస్వామ్యం‘ అనే ఉపన్యాస పోటీలో జడ్పిహెచ్ఎస్ పెద్దపాపయ్యపల్లి పాఠశాల విద్యార్థిని Y.శ్రీ హర్షిని 10వ తరగతి బాలిక మండల స్థాయిలో ప్రథమ స్థానం పొంది జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సర్టిఫికెట్ ను తీసుకోవడం జరిగిందన్నారు. ఇందుకు గాను మండల విద్యాధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు విద్యార్థినీకి శుభాకాంక్షలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!