Social 1080×1350 • Multi-page
25-01-2025 BREAKING NEWS 09:17 PM
swarnodayam.com
Telugu Daily News

దశలవారీగా పోరాటలకు సిద్ధం అవుదాం టియు డబ్ల్యూజే (ఐజేయు) జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్

దశలవారీగా పోరాటలకు సిద్ధం అవుదాం టియు డబ్ల్యూజే (ఐజేయు) జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
మా ఇల్లు మాకు కావాలనే నినాదంతో హుజురాబాద్ పట్టణంలో జర్నలిస్ట్ కేటాయించిన నివేషణ స్థలాల సాధన కోసం దశల వారి ఉద్యమాన్ని చేయనున్నట్లు టియుడబ్ల్యూజే(ఐజేయు)
జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్ అన్నారు.
శనివారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం శనివారం శ్రీ సాయి కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నగునూరి శేఖర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇళ్ల స్థలాల పూర్తిస్థాయి కేటాయింపు కోసం పలుమార్లు కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులకు, మంత్రులకు వినతి పత్రం అందించిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. టీయుడబ్ల్యూజే పోరాటాలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, మన హక్కుల కోసం మరోసారి పోరాట బాట తప్పదని అన్నారు. స్థలాల కోసం మొదటగా సోమవారం నుంచి దశల వారి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మొదటిరోజు ఎంఆర్ఓకి వినతి పత్రం అందించడంతోపాటు మిగతా అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. అప్పటికి స్పందించకపోతే నిరసన కార్యక్రమాలతో పాటు దీక్షలు చేపడతామని, అంతటితోను సమస్య పరిష్కారం జరగకుంటే ఆమరణ దీక్ష వరకు కూడా వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలగందుల రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు భరణి, హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ ధర్మారెడ్డి, కో- కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరి సాయికృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ మక్సుద్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిలుకమారి సత్యరాజ్, వేల్పుల సునీల్, సీనియర్ జర్నలిస్టులు తిరునహరి ఆంజనేయస్వామి, కోరం సుధాకర్ రెడ్డి, మామిడి రవీందర్, పరాంకుశం కిరణ్ కుమార్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!