Social 1080×1350 • Multi-page
25-01-2025 BREAKING NEWS 09:44 PM
swarnodayam.com
Telugu Daily News

ఓటరుగా ఓటువేయడం ప్రతి పౌరుడి బాధ్యత! -హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు

ఓటరుగా ఓటువేయడం ప్రతి పౌరుడి బాధ్యత! -హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఓటరుగా ఓటు వేయడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని హుజురాబాద్ ఆర్డీవో సిహెచ్ రమేష్ బాబు అన్నారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు, ఉద్యోగులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారిచే ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఎన్నికల్లో తప్పనిసరిగా కుల మత వర్గలకు అతీతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. నిజాయితీగా ప్రతి ఓటరు ఓటు వేయడం వల్ల మంచి ప్రతినిధులు ఎన్నిక అవుతారని అన్నారు. మన బాధ్యత సక్రమంగా నిర్వర్తించకపోతే నష్టపోయేది ప్రజలే అని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓటరుగా ఓటు వేయడం తప్పనిసరి అని అన్నారు. కాగా సామాజిక కార్యకర్త, బిఎల్ ఓ కోటోజు జ్యోతిరాణి తన వాహనంపై ఓటు హక్కు వినియోగంపై చైతన్య పరుస్తూ ప్రచారం చేయడం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ తాసిల్దార్ కే కనకయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయరావు, ఆర్ఐ రంజిత్ రెడ్డి, శేఖర్, తులసీదాస్, మురళీమోహన్, భాస్కర్, జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!