Social 1080×1350 • Multi-page
26-01-2025 BREAKING NEWS 12:10 PM
swarnodayam.com
Telugu Daily News

ఉత్తమ జవానుగా ప్రశంసా పత్రం అందుకున్న ప్రతాప రాజు

ఉత్తమ జవానుగా ప్రశంసా పత్రం అందుకున్న ప్రతాప రాజు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పురపాలక సంఘంలో జవానుగా సేవలందిస్తున్న ప్రతాప రాజుకు ఉత్తమ సేవలను గుర్తించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సానిటరీ విభాగంలో ఉత్తమ జవాన్ గా గుర్తించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. హుజురాబాద్ బల్దియాలో సానిటరీ విభాగంలో జవానుగా అంకితభావంతో నిబద్ధతతో సేవలందిస్తున్న రాజు పలువురి ప్రశంసలు అందుకుంటుండడంతో ఆయనను ఉత్తమ జవాన్ గా ఎంపిక చేసినట్లు తెలిసింది. సానిటరీ విభాగంలో జిల్లా ఉత్తమ జవాన్ గా ప్రశంస పత్రం అందుకున్న ప్రతాప రాజుకి కమిషనర్ ఎస్ సమ్మయ్య చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, సానిటరీ ఇన్స్పెక్టర్ కిషన్ రావు, తోటి జవాన్లు, పారిశుద్ధ సిబ్బంది హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!