26-01-2025 NORMAL NEWS 12:51 PM
swarnodayam.com
Telugu Daily News
26-01-2025 12:51 PM By Mandala Yadagiri

జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్ కి వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ఉత్తమ ఉద్యోగిగా అవార్డు

జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్ కి వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ఉత్తమ ఉద్యోగిగా అవార్డు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత 30 ఏళ్లుగా పంజాల ప్రతాప్ గౌడ్ వైద్య ఆరోగ్యశాఖలో అందిస్తున్న సేవలకు గాను జిల్లా ఉత్తమ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగిగా సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో వివిధ హోదాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించుటలో విశేషంగా కృషిచేసిన పంజాల ప్రతాప్ డిస్టిక్ హెల్త్ ఎడ్యుకేటర్ గా ఉత్తమ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగిగా ఎంపిక చేసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పంజాల ప్రతాప్ కి అవార్డు రావడం పట్ల హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యామ్, ఆఫ్తాల్మిక్ఆఫీసర్ రగోతంరెడ్డి, డివిజన్ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేసి ప్రశంసించారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!