26-01-2025 NORMAL NEWS 03:07 PM
swarnodayam.com
Telugu Daily News
26-01-2025 03:07 PM By Mandala Yadagiri

గంగిశెట్టి ట్రస్ట్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

గంగిశెట్టి ట్రస్ట్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
IMG_20250126_150408

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు తమ ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్టు నిర్వాహకుడు గంగిశెట్టి జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా కార్యాలయ ట్రస్ట్ పైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడికి వచ్చిన చిన్నారులకు పెద్దలకు స్వీట్లు (మిఠాయిలు) పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ తెనుగువాడ, ప్రైమరీ స్కూల్ ప్రతాప్ వాడకు సంబంధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, వీధిలోని ప్రజలు పాల్గొన్నారు.

Oplus_131072 ట్రస్ట్ పై జెండా ఆవిష్కరిస్తున్న గంగిశెట్టి జగదీశ్వర్
Oplus_131072 విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేస్తున్న జగదీశ్వర్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!