Social 1080×1350 • Multi-page
26-01-2025 BREAKING NEWS 06:03 PM
swarnodayam.com
Telugu Daily News

అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..ఆందోణన చెందకండి..అండగా ఉంటాం-కాంగ్రెస్ నేత ప్రణవ్.

అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..ఆందోణన చెందకండి..అండగా ఉంటాం-కాంగ్రెస్ నేత ప్రణవ్.
IMG-20250126-WA0141

–ధర్మరాజుపల్లి, గండ్రపల్లి, బోగంపాడు, శ్రీరాములపేట, దేశరాజ్ పల్లి గ్రామాల్లో అట్ట హసంగా పథకాల ప్రారంభం.

–వర్చ్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.

–ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సిఎం రేవంత్, మంత్రివర్గానికి ప్రణవ్ కృతజ్ఞత.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజల ఆకాంక్షలను, కళలను నెరవేర్చే నాలుగు పథకాలకు ఆదివారం అంకురార్పణ చేయడం శుభ సూచకమని, ఇంత వరకు చరిత్రలో ఏ రాజకీయ పార్టీ, ప్రభుత్వం నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతనంగా రేషన్ కార్డుల పంపిణీ లాంటి పథకాలను ప్రారంభించిన దాఖలాలు లేవని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ మండల పరిధిలోని ధర్మరాజుపల్లెలో నాలుగు పథకాలకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తామని దీనిపై ప్రజలకు ఎవరికి ఆందోళన అవసరం లేదని, అర్హులైన ప్రతి లబ్ధిదారినీకి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని తెలిపారు. ఒకే రోజు నాలుగు ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వర్గానికి హుజురాబాద్ ప్రజల పక్షాన కృతఙ్ఞతలు తెలియజేశారు. ఇదే విధంగా మార్చ్ 31 తారీఖు లోపు అన్ని గ్రామాల లబ్దిదారులకు పట్టాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!