Social 1080×1350 • Multi-page
26-01-2025 BREAKING NEWS 09:08 PM
swarnodayam.com
Telugu Daily News

నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మేయర్ వై.సునీల్ రావు..

నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మేయర్ వై.సునీల్ రావు..
IMG_20250126_210055

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి.నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో నగర ప్రథమ పౌరులు, మేయర్ వై.సునీల్ రావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవ వందనం చేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. మొదటగా నగరంలోని వెంకటేశ్వర థియేటర్ కార్ టాక్సీ స్టాండ్ వద్ద అనంతరం కాశ్మీర్ గడ్డ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ కాలేజ్ వద్ద, మార్కెట్ రోడ్డు మున్సిపల్ రిజర్వాయర్ లో, నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో మున్సిపల్ కార్మిక విభాగం ఆఫీస్ వద్ద, మున్సిపల్ ఉద్యోగుల సంఘం భవనం వద్ద, బస్టాండ్ సమీపంలో దుర్గ భవాని ఆటో స్టాండ్ వద్ద, ఫోర్ వీలర్ అసోసియేషన్ భవనం వద్ద, భగత్ నగర్ మేయర్ క్యాంప్ ఆఫీస్ లో, భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో, భగత్ నగర్ లోని చైతన్య యూత్, క్లబ్, ఆదర్శ యూత్ క్లబ్, పెద్దమ్మ యూత్ క్లబ్, జైబూన్ యూత్ క్లబ్,గోదాంగడ్డ ఆటో స్టాండ్, గోదాంగడ్డలో కొట్టే శివ మరియు పొన్నం మొండయ్య గౌడ్ ఆధ్వర్యంలో, రామచంద్రపూర్ కాలనీ బైపాస్ రోడ్డులోని పెద్దమ్మ టెంపుల్ లో మొదలగు ప్రాంతాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నగర మేయర్ వై.సునీల్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే నగరపాలక సంస్థ కార్యాలయం, పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!