Social 1080×1350 • Multi-page
26-01-2025 BREAKING NEWS 10:05 PM
swarnodayam.com
Telugu Daily News

పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణమాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం.

పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణమాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం.
IMG_20250126_220048

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సామాజిక ఉద్యమాల సృష్టికర్త మంద కృష్ణ మాదిగకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం రాత్రి అంబేద్కర్ చౌరస్తా దగ్గర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు, ఉప కులాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఉత్సాహంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కృష్ణమాదిగ సమాజంలోని అన్ని వర్గాలు ప్రజలైన గుండె జబ్బుల ఉద్యమం ద్వారా ఆరోగ్యశ్రీ, దివ్యాంగుల, వృద్ధుల ,వితంతువుల పింఛన్లు పెంపు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రక్షణ తదితర ఉద్యమాలు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రజా వ్యవహారాలలో పద్మశ్రీని ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం, మారేపెల్లి శ్రీనివాస్, మాదిగ కళా మండలి హుజురాబాద్ డివిజన్ అధ్యక్షురాలు ఆకినపల్లి శిరీష, మండల అధ్యక్షుడు ఎర్ర శ్రీధర్, తిప్పారపు సంపత్, ముక్క రమేష్, తునికి వసంత్, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, దేవునూరి రవీందర్, ఎర్ర రవీందర్ , బొరగాల సారయ్య, పొడిశెట్టి వెంకట రాజం, కలవల మల్లయ్య, వేల్పుల రత్నం, ఎర్ర రాజ్ కుమార్, ఎర్ర నాగరాజు, మోలుగు శ్రీనివాస్, మెలుగు అనిల్, తునికి సమ్మయ్య, ఉప్పలమ్మ, ఇల్లందుల సమ్మయ్య, రామ్ రాజేశ్వర్, వేల్పుల ప్రభాకర్, తాళ్లపల్లి అమరేందర్ గౌడ్, జీడి రవితేజ, బొడ్డు అయిలయ్య, మాడుగుల ఓదెలు, సిరికొండ సమ్మయ్య, బొడ్డు మధుకర్, ముక్క రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!