Social 1080×1350 • Multi-page
27-01-2025 BREAKING NEWS 08:46 AM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

హుజూరాబాద్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్: హుజూరాబాద్ డివిజన్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ప్రజలు, అధికారులు, ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలను చక్కగా అలంకరించారు . పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఇటీవల జరిగిన క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. హుజురాబాద్ కోర్టు భవన సముదాయంలో సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, న్యాయమూర్తులు అలేఖ్య, స్వాతి, ఆర్జీవో కార్యాలయంలో ఆర్డీవో రమేశ్ బాబు, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ శ్రీనివాస్ జీ, ఎంవీఐ కార్యాలయంలో ఎంవిఐ కంచి వేణు, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సల్వాది సమ్మయ్య, తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు కె కనకయ్య, ఏడీఏ కార్యాలయంలో ఏడిఏ సునీత, సీడీపీవో కార్యాలయంలో సీడీపీవో సుగుణ, పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్ గుర్రం తిరుమల్ గౌడ్, ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో తూర్పాటి సునీత, డిప్యూటీ డీఎంహెచ్వై కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్పీ డాక్టర్ చందు, ఏరియా సూపరిండెంట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, ఆర్టీసీ డిపోలో డీఎం రవీంద్రనాథ్, కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు, మార్కెట్ కార్యాలయంలో కార్యదర్శి చంద్రశేఖర్, పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ అధ్యక్షులు జెండాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, పలువురు తాజా మాజీ కౌన్సిలర్లు, బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072 మున్సిపల్ కార్యాలయం వద్ద
Oplus_131072 టోలిచౌకి వద్ద
Oplus_131072 డీసీఎంఎస్ కాంప్లెక్స్ వద్ద బిజెపి నేతలు

వ్యవసాయ మార్కెట్ కమిటీలో జెండాకు వందనం చేస్తున్న చైర్మన్, కాంగ్రెస్ నేతలు, పాలకవర్గ సభ్యులు,

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!