Social 1080×1350 • Multi-page
27-01-2025 BREAKING NEWS 02:36 PM
swarnodayam.com
Telugu Daily News

క్షణం క్షణం.. భయం భయం!అర్ధరాత్రి అనుమానాస్పదంగా మాజీ సర్పంచ్..మధుసూదన్ సంచారం.

క్షణం క్షణం.. భయం భయం!అర్ధరాత్రి అనుమానాస్పదంగా మాజీ సర్పంచ్..మధుసూదన్ సంచారం.
IMG_20250127_143416

– భయాందోళనకు గురైన గ్రామ ప్రజలు..
దొంగలు అనుకొని పోలీస్ స్టేషన్ కు సమాచారం.
!
▪️కొన్ని కుటుంబాలను చిన్న భిన్నం చేసాడు..
▪️ అ మాజీ సర్పంచ్ తో నాకు ప్రాణం భయం ఉంది.. బాధితుడు సోహెల్ ఆడియో కలకలం.
▪️పేరుకు పెద్దమనిషి..చేసేవి చిల్లర పనులు.
!

కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట
మండలం కోరపల్లి గ్రామంలో అర్ధరాత్రి ప్రజలు క్షణం క్షణం.. భయం భయంగా గడిపారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అర్ధరాత్రి 11, 12 గంటల ప్రాంతంలో బిజిగిరి పక్కన ఉన్న (ముళ్లపల్లె) అనే గ్రామంలో అర్ధరాత్రి అడవి ప్రాంతంలో అతని కారు ఉండేసరికి ఈ సమయంలో కారు ఇక్కడ ఉంది ఏంటి అని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అర్ధరాత్రి గ్రామము పక్కన చెట్ల పొదల్లో కారు ఆగి ఉండడం చూశామన్నారు. గ్రామస్తులు భయాందోళనకు గురై దొంగలు కావచ్చు అనుకొని, ఊరు గ్రామ ప్రజలు అందరూ కలిసి అక్కడికి వెళ్లి చూడగా, కోరపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మధుసూదన్ అక్కడ ఉన్నాడని తెలిపారు. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని అడగగా.. వేరే పని మీద వచ్చాను అని, నాకు సిమెంట్ బస్తాల గోధుమ్ ఉంది, అని వేరే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అని తెలిసి వాళ్లతో మాట్లాడదామని వచ్చాను అని అన్నాడని తెలిపారు.
కానీ అదే గ్రామానికి చెందిన సోహెల్.. గతంలో తన మీద కక్షపూరితమైన కేసులు పెట్టించాడని మధుసూదనని తెలిపారు. నా ఇంటి వెనకాల ఉన్న చెట్ల పొదల్లో అతని కారు ఉండడం వల్ల దొంగలు కావచ్చు అని నేను గ్రామస్తులకు తెలియజేయడమైనదని తెలిపారు. కాగా ఎవరు అని చెప్పి మేము నలుగురం వెళ్లేసరికి అక్కడ ఉన్న కొందరు కత్తులు తీయండి నరికేద్దాం వాన్ని అనడం జరిగిందని వివరించారు. అంతలోపే గ్రామస్తులు అందరూ చేరుకోగా, గతంలో కేసు పెట్టిన ఇతనే మళ్లీ అక్కడ ఉన్నందున నన్ను చంపేందుకే వచ్చారని సోహెల్ ఆరోపించారు. గతంలో ఇతని వల్ల మా నాన్న చనిపోయాడని, ఇప్పుడు నన్ను కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారని సోహెల్ ఆందోళన వ్యక్తం చేశారు. పని మీద వచ్చిన వ్యక్తి సిసి రోడ్డు మీద నుంచి వచ్చి వెళ్లాలి తప్ప, కారును చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి, అక్కడ లైట్స్ ఆఫ్ చేసుకుని నా ఇంటి వెనుక భాగంలో ఉండడం, పలు అనుమానాలకు దారితీస్తుందని వివరించారు. ఇతని వాళ్ళ కొన్ని కుటుంబాలు నష్ట పోయాయాని పేర్కొన్నారు. పేరుకు పెద్ద మనిషి, చేసేటివి చిల్లర పనులు అని తెలిపారు. ఇంతలోనే గ్రామస్తులు 100కు డయల్ చేసి వివరాలు తెలుపగా జమ్మికుంట పోలీస్ లు వచ్చి, మాజీ సర్పంచ్ మధును అక్కడ నుండి తీసుకెళ్లడం జరిగిందన్నారు. రేపు ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు ఇవ్వమని రాత్రి పోలీసులు గ్రామస్తుల సమక్షంలో తెలిపారని సోహెల్ చెప్పారు. కానీ అతని వల్ల తనకు ప్రాణభయం ఉందని, అతని నుండి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని సోహెల్ పోలీస్ అధికారులను కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!