Social 1080×1350 • Multi-page
27-01-2025 BREAKING NEWS 11:09 PM
swarnodayam.com
Telugu Daily News

ఆరె మరాఠా కమ్యూనిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

ఆరె మరాఠా కమ్యూనిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి 26 : హుజురాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి ఆరె మరాఠా కమ్యూనిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆరె బంధువుల ఐక్యత, ఓబీసీ సర్టిఫికెట్స్ గురించి మరియు సమాజంలో జరిగే ఆర్థిక అసమానతలు ఎలా అధిగమించాలి, ఈ కుల సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచాలో అనేక విషయాలు చర్చించారు. అనంతరం సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా మొకిలి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా అంగీరక శంకర్ ప్రసాద్, కార్యదర్శిగా మొకిలి శ్రీనివాస్ (అడ్వకేట్), కోశాధికారిగా ఉపాసి రాజ్ కుమార్ లను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా తిప్పారపు హరికృష్ణ, గోజ గాని సునీల్, ఉపాసి నరేష్, మొకిలి రాజయ్య నియమితులు అయ్యారు. ఈ సమావేశంలో మొకిలి రాజేందర్, మొకిలి బిక్షపతి, మొకిలి అనిల్, మొకిలి సునీల్, ఉపాసి సురేందర్, ఉపాసి సురేష, గోపిశెట్టి శ్రీనివాస్, రమేష్, నవీన్, మొకిలి మారుతి, మొగిలి రమ్య, నాగూర్ల గీత, అంగరిక సుజాత, గోజగాని హామిక తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!