28-01-2025 NORMAL NEWS 05:51 PM
swarnodayam.com
Telugu Daily News
28-01-2025 05:51 PM By Mandala Yadagiri

పంటలను పరిశీలించిన ఉప వ్యవసాయ సంచాలకులు

పంటలను పరిశీలించిన ఉప వ్యవసాయ సంచాలకులు
IMG-20250128-WA0127

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం ఇప్పలనర్సింగాపూర్ లో కరీంనగర్ ఉప వ్యవసాయ సంచాలకులు ఛత్రునాయక్ పంటలను పరిశీలించి రైతులకు సలహాలు సూచనలు తెలియజేశారు. వరిలో జింకు దాతు లోపం గమనిస్తే నివారణకు 2గ్రాముల జింక్ సల్పేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ఒకే వరి పంట పండించే పొలాల్లో రైతులు ప్రతి యాసంగిలో జింక్ సల్పేట్ ని ఎకరాకి 20 కిలోలు ప్రధాన మడిలో ఆఖరి దమ్ములో తప్పక వేయాలన్నారు. రైతులు అధిక ధర వుందని పొటాష్ నీ వాడడం తగ్గించారని నాటు వేసిన 30 రోజులు లోపు పొటాష్ వేయాలని తెలియజేశారు. ముందస్తు నాట్లు వేసిన వరిలో కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని నివారణకు ఒకసారి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. యసంగిలో వరి సాగు చేయు రైతులు చేతి కలుపు తీసిన తరువాత నీటిని తీసివేసి చీమ పగుళ్లు వచ్చేవరకు పొలం అరబెట్టినైతే సల్ఫేడ్ ఇంజురి ప్రభావాన్ని తగ్గించవచ్చు అని సిఫారసు చేశారు. ఆయన వెంట హుజురాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు సునీత, వ్యవసాయ అధికారులు భూమిరెడ్డి, ఖాదర్ అలీ, వ్యవసాయ విస్తరణ అధికారులు సతీష్ రెడ్డి, నిఖిల్ మరియు రైతులు పాల్గొన్నారు.

రైతు భరోసా యసంగి 2024-25

సహాయ వ్యవసాయ సంచాలకులు, హుజురాబాద్ డివిజన్ సూచన , రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధించే పెట్టుబడి సహాయం” రైతు భరోసా ” పొందుటకు అర్హులైన రైతులు అనగా తేది 01-01-2025 కి ముందు పట్ట పాస్ పుస్తకం పొందిన రైతులు మీ గ్రామ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ నమోదు ప్రక్రియ తేది 30-01-2025 న ముగుస్తుందన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!