29-01-2025 NORMAL NEWS 05:15 PM
swarnodayam.com
Telugu Daily News
29-01-2025 05:15 PM By Mandala Yadagiri

రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి..హుజురాబాద్ మోటార్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు

రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి..హుజురాబాద్ మోటార్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు
IMG-20250129-WA0310

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట) జనవరి 29: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మోటారు వాహనాల తనిఖీ అధికారి కంచి వేణు అన్నారు. జాతీయ రోడ్డుభద్రత మహోత్సవం సందర్భంగా జమ్మికుంట లారీ అసోసియేషన్ లో ఓనర్స్ మరియు డ్రైవర్స్ కు అవగాహన కల్పించారు. డ్రైవింగ్‌లో నైపుణ్యం సరిగా లేకపోవడం, రోడ్డు భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం, అవగాహన లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్‌ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్‌ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారి తీస్తాయన్నారు. వాహనము మలుపు తిరుగుతున్నప్పుడు నిలుపు ఉన్నప్పుడు చేతితో సరైన సంకేతాలు ఇవ్వాలి. ముందు వెళ్లే వాహన డ్రైవరు దారి ఇవ్వనిచో వాహనము దాటుటకు ప్రయత్నించకండి, కదులుతున్న వాహనాన్ని ఎక్కడం కానీ దిగడం కానీ చేయకూడదు అన్నారు. రాత్రి సమయంలో ఎదురుగా వాహనములు వచ్చినప్పుడు హెడ్లైట్ డిమ్ చేయాలని, ఇరుకు వంతెన వద్ద ట్రాఫిక్ ను గమనించి సహనముతో దాటాలన్నారు. క్షేమంగా చేరుటకు ఏకైక మార్గం అని, తడిగా ఉన్న ఆయిల్ ఉన్న ఇసుక దుమ్ము బురద రోడ్డుపై వేగంగా వెళ్ళుట ప్రమాదకరం అన్నారు. రోడ్డు నిబంధనలు సూచనలకు డ్రైవర్లకే కాకుండా పాదాచారులకు కూడా వర్తింపచేస్తాయన్నారు. పాదాచారులు రోడ్డుకు ఇరువైపులా చూసి వాహనము రానప్పుడు జీబ్రా లైన్ల వద్దనే రోడ్డును దాటాలని, నిర్ధారిత స్థలంలో మాత్రమే వాహనాన్ని పార్కింగ్ చెయ్యాలన్నారు. మార్గం రాత్రి వేళలో వాహనాన్ని నిలిపి ఉంచినప్పుడు పార్కింగ్ లైటు తప్పనిసరిగా వెయ్యాలన్నారు. ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌, ట్యాక్స్‌, పొల్యూషన్‌ రికార్డులన్నీ బస్సులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు నిబంధనలు పాటించాలని తెలిపారు. మద్యం తాగి, నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. .వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు, కుటుంబ సభ్యులు తమ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నాగరాజు, హోంగార్డ్ గుర్రం శ్రీకాంత్ గౌడ్, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072 రోడ్డు భద్రతపై రూపొందించిన కరపత్రాలను పంచుతూ డ్రైవర్లకు వివరిస్తున్న ఎంవిఐ
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!