29-01-2025 NORMAL NEWS 05:39 PM
swarnodayam.com
Telugu Daily News
29-01-2025 05:39 PM By Mandala Yadagiri

బిజెపి హుజురాబాద్ పట్టణ, మండల శాఖల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

బిజెపి హుజురాబాద్ పట్టణ, మండల శాఖల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
IMG_20250129_172721

మండలానికి ఒక ఊరిలోనే సంక్షేమ పథకాలని కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఎందుకు పెట్టలేదు..

,-దేశద్రోహ, అర్బన్ నక్సలైట్లకు అవార్డులు ఎందుకు ఇవ్వాలి….!?

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు మాట్లాడుతూ ఎంతోమంది పోలీసులను, జాతీయవాదులను చంపిన నరహంతక నక్సలైట్లకు మద్దతుగా పాటలు పాడిన గద్దర్ కి పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడం జరిగింది. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యవస్థలో పనిచేసి ఎంతోమంది యువకులను అడవుల బాట పట్టించిన గద్దర్ ఎందరో తల్లుల కడుపు కోతకు కారణమయ్యాడు. దేశానికి వ్యతిరేకంగా నిరంతరం పనిచేసిన గద్దర్ కి అవార్డుల ఎలా ఇస్తారని ప్రశ్నించిన బండి సంజయ్ గారి మాటల్లో ఎలాంటి తప్పు లేదని, బండి సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టిన కాంగ్రెస్ నాయకులకు సిగ్గు శరం లేవని, ఎప్పుడూ దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే శక్తులకు వంతపాడడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదని అన్నారు. బడుగు బలహీన వర్గాల నిమ్నవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంధన్నారు.
ఎన్నికలైన ఏడాది తర్వాత ప్రజల్ని ఇంకా మోసం చేస్తుంది…
మండలానికి ఒక్క ఊరిలోనే పథకాలు అని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎందుకు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలు హామీలను అమలు చేయడంలో విఫలమైందని, నాలుగు గ్యారెంటీలను పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై బిజెపి శ్రేణులు భగ్గుమన్నారు. వంద రోజుల్లోనే హామీలు అమలుచేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కారు..వన్ ఇయర్ తర్వాత వన్‌ విలేజ్‌ అనడం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి ఒక్క గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ఆ గ్రామంలో 4 పథకాలను అమలు చేస్తాం’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ ఇస్తామని మభ్యపెట్టి ఏడాది తర్వాత ఒక్క గ్రామమే అని పేర్కొనటం సర్కార్‌ దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటా అబద్ధపు హామీలు ఊదరగొట్టి, గద్దెనెక్కి నాన్చి నాన్చి ఇప్పుడు మండలానికి ఒక గ్రామంలోనే పథకాలను ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయటమే అన్నారు. మండలానికి ఒక ఊరు అనే మోసపూరిత విధానాన్ని పక్కనపెట్టి అన్ని గ్రామాల్లో స్యాచురేషన్‌ పద్ధతిలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే అన్ని గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు తరిమికొట్టే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, హుజురాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్, నాంపల్లి సుమన్, నరాల రాజశేఖర్, తిప్ప బత్తిని రాజు, తూముల శ్రీనివాస్, యాళ్ళ సంజీవరెడ్డి, పోతుల సంజీవ్, గంట సంపత్, పుల్లూరి శ్రీకాంత్, పల్లెని దేవేందర్ రావు, గుర్రం సంతోష్, కుసుమ సమ్మయ్య, తేలుకుంట్ల శ్రీనివాస్, మాడిశెట్టి చందర్, ఆవుల సదయ్య, తాళ్లపల్లి దేవేంద్ర, మాటూరి స్వర్ణలత, కెక్కెర్ల రేణుక, యాట రాజేష్, పల్లె వీరయ్య, హృతిక్, ములుగురి రాజు, చెత్తార్ సింగ్, కార్తీక్, రాపాక రాజు, నీలం రవీందర్, గంధం అనిల్, తాళ్లపల్లి హరీష్, మండల నాయకులు నరేడ్ల ప్రవీణ్ రెడ్డి, నరేడ్ల చైతన్య రెడ్డి, మండల సాయిబాబా, చిదురాల రాణి, రెడ్డి కొన్ని ప్రవీణ్, ప్రసన్నారెడ్డి, పూర్ణచందర్, తాళ్లపల్లి శ్రీనివాస్, గణేష్, ప్రశాంత్ బైరెడ్డి, సంపత్ రెడ్డి, బంటు, నవీన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!