Social 1080×1350 • Multi-page
29-01-2025 BREAKING NEWS 08:07 PM
swarnodayam.com
Telugu Daily News

పీవీ సేవా సమితి సేవలు అభినందనీయం…. ఎమ్మెల్సీ వాణి దేవి.

పీవీ సేవా సమితి సేవలు అభినందనీయం…. ఎమ్మెల్సీ వాణి దేవి.
IMG-20250129-WA0307(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి గత 5, 6 సంవత్సరాల నుండి హుజురాబాద్ పరిసర ప్రాంతాలలో ఉచిత సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. గతంలో వీరు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలకు తాను ముఖ్య అతిథిగా హాజరు అయినట్లు వాణిదేవి తెలిపారు. హుజురాబాద్ పట్టణానికి చెందిన పీవీ సేవ సమితి ప్రతినిధులు వాణిదేవిని మంగళవారం వారి స్వగృహంలో కలిసి పీవీ సేవ సమితి ఆధ్యర్యంలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వారికి వివరించారు. ఇందుకు వాణిదేవి సంతోషం వ్యక్తం చేశారు. నా సహాయ సహకారాలు ఉంటాయని ముందు ముందు ఇతర సేవ సంస్థలకు పీవీ సేవ సమితి నిర్వహించు సేవలు ఆదర్శంగా ఉండాలని సేవ సమితి ప్రతినిధులకు వాణిదేవి సూచించారు. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించిన సందర్భాన్ని ఎమ్మెల్సీ మరోమారు గుర్తు చేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచినట్లు పీవీ సేవ సమితి అద్యక్షుడు తూము వెంకట్ రెడ్డి తెలిపారు, అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి. మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!