29-01-2025 NORMAL NEWS 10:26 PM
swarnodayam.com
Telugu Daily News
29-01-2025 10:26 PM By Mandala Yadagiri

బిఆర్ఎస్, తన పోరాట ఫలితమే దళిత బంధు నిధుల మంజూరు.. -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

బిఆర్ఎస్, తన పోరాట ఫలితమే దళిత బంధు నిధుల మంజూరు.. -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే దళిత బంధు అమలుపై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్టు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దళితబందు రెండో విడత నిధులు విడుదల కోసం ప్రభుత్వం మెడలు వంచి పోరాటం చేయడం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు. దళితబందు అమలుపై అసెంబ్లీలో, జిల్లా పరిషత్ సమావేశంలో, కలెక్టర్ సమావేశంలో, హుజూరాబాద్ పట్టణంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు అక్రమ కేసులు పెట్టారని, కాంగ్రెస్ నాయకుల చేత దాడులు చేయించేందుకు ప్రయత్నించిందని అన్నారు. పోరాటాలను అణిచిసివేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నిందని అన్నారు. దళితుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసేందుకు సిద్ధమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధుపై ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్ఎస్, తన నిరంతరం పోరాటం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే పోరాటాలకు సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!