Social 1080×1350 • Multi-page
01-02-2025 BREAKING NEWS 11:53 PM
swarnodayam.com
Telugu Daily News

తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ లకు పదవి విరమణ ఆత్మీయ సత్కారం

తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ లకు పదవి విరమణ ఆత్మీయ సత్కారం
IMG-20250201-WA0204

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు సుద్దాల హరిశంకర్ ఆధ్వర్యంలో తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ లకు పదవి విరమణ ఆత్మీయ సత్కారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నేతలు గందె రాధిక శ్రీనివాస్ చేసిన పట్టణ అభివృద్ధిని మరియు వైశ్య సంఘ భవన నిర్మాణానికి మరియు సంఘ స్మశాన వాటికకు చేసిన అభివృద్ధిని పలువురు ప్రసంశించారు. ఈ సందర్భంగా గందె రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ నా ఎదుగుదలకు ఎంతో ముఖ్య పాత్ర పోషించిన ఆర్యవైశ్యులకు ఎప్పుడు రుణపడి ఉంటానని, ఎప్పుడూ ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ముందు ఉంటానని చెప్పారు. సంఘ శ్రేయస్సుకు, సమాజ శ్రేయస్సుకు, సమాజాభివృద్ధికి తన వంతు కృషి ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగిందని తెలియజేసారు. ఈ సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్యవైశ్య సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం హుజురాబాద్ అధ్యక్షు డు సుదాల హరిశంకర్, ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి నూక శ్రీనివాస్, కోశాధికారి రేణిగుంట్ల సురేష్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కోడిత్యాల నాగరాజ్, వాసవి క్లబ్ మెన్స్ అధ్యక్షులు అక్కినపల్లి శ్రవణ్ కుమార్, ఉమెన్స్ అధ్యక్షురాలు నార్ల అర్చన, ఆవోప అధ్యక్షులు శివనాధుని ఈశ్వరయ్య,
సంఘ నాయకులు నార్ల రాజేందర్, క్యాస ఛక్రధర్, వివేకవర్ధిని ప్రసాద్, క్యాస ఉపేందర్, పుల్లూరి శ్రీకాంత్, కోమురవెల్లి రఘువీర్, భూపతి కుమారస్వామి, బల్లు పున్నం, తాటిపెళ్లి రాజన్న, కేదారేశ్వర రాజన్న, కొమురవేల్లి హరిప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!