Social 1080×1350 • Multi-page
02-02-2025 BREAKING NEWS 10:52 AM
swarnodayam.com
Telugu Daily News

రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాచర్ల రాజుగౌడ్

రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాచర్ల రాజుగౌడ్
IMG_20250202_105017

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాలుగుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన మాచర్ల రాజు గౌడ్ సేవలను గుర్తించిన రాష్ట్ర నూతన కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించింది. ఈ అవకాశం రావడానికి ముఖ్య కారణం అయిన హుజురాబాద్ మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతి సభ్యుడికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నాడు.
హుజురాబాద్ మండలానికి ఎన్నో సేవలు చేశాడు కాబట్టే ఇంత త్వరగా రాష్ట్రస్థాయి వరకు గుర్తింపు వచ్చిందని హుజురాబాద్ మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశం కల్పించడంతో మరికొంత బాధ్యతలు పెరిగాయని, ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి అన్ని విధాల రాష్ట్ర సహకారంతో కృషి చేస్తానని రాజు తెలిపారు. హుజురాబాద్ మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ కుటుంబ సభ్యులందరికీ మరింత సేవలు చేస్తానని ఇట్టి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కె హుస్సేన్ కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవన్నకి, కోశాధికారి మాధవరెడ్డికి, కేదార్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానని రాజు తెలిపారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన మాచర్ల రాజు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!