Social 1080×1350 • Multi-page
04-02-2025 BREAKING NEWS 11:18 PM
swarnodayam.com
Telugu Daily News

హోటల్స్ పై మున్సిపల్ అధికారుల దాడులు… మందలించి వదిలేసిన కమిషనర్

హోటల్స్ పై మున్సిపల్ అధికారుల దాడులు… మందలించి వదిలేసిన కమిషనర్
IMG_20250204_231539

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్ లో గల పలు హోటల్స్, బేకరీలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి పారిశుద్ధ్యం కరువైన వాటి నిర్వాహకులను గట్టిగా మందలించి మొదటి తప్పుగా క్షమించి వదిలేశారు. జమ్మికుంట రోడ్ లోని నటరాజ్ ఉడిపి హోటల్, కరాచీ బేకరీ, ఓ స్వీట్ హౌస్ లను అధికారులు సందర్శించి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో నిర్వాహకులను గట్టిగా మందలించారు. పరిశుభ్రత పాటించి నాణ్యమైన తినబడాల అందించనట్లయితే జరిమానాలు విధించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుద్ధ్యం లేకపోతే ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుందని పట్టణంలోని హోటల్, బేకరీ యజమానులు తగిన శ్రద్ధ తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్ కె సమ్మయ్య సూచించారు. ఈ దాడుల్లో మున్సిపల్ అధికారులు కిషన్ రావు, రమేష్, రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!