Social 1080×1350 • Multi-page
05-02-2025 BREAKING NEWS 05:25 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రతిభ కనబరిచిన విద్యార్థికి ప్రశంసల వెల్లువ

ప్రతిభ కనబరిచిన విద్యార్థికి ప్రశంసల వెల్లువ
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మండలస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ప్రధమ స్థాయి బహుమతి పొందిన హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన పాకాల యశ్వంత్ రెడ్డిని ఆ పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ అనురాధ విద్యార్ధిని అనునిత్యం గైడ్ చేసి మండల స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిపిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు ఆవుల పద్మశ్రీని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుగుణ, ఆవుల పద్మశ్రీ, బేతి తిరుపతిరెడ్డి, మందుల వెంకటరమణారెడ్డి, మావిడాల సతీష్ కుమార్, ఎర్రి శ్రీనివాస్ రెడ్డి, మంద రమేష్ బాబు, దూడ సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!