Telugu Daily News
సగర సంఘం హుజురాబాద్ అధ్యక్షుడిగా ఎంజాల వాసు సగర

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సగర సంఘం హుజురాబాద్ అధ్యక్షుడిగా ఎంజాల సగర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలో ఆ సంఘం సమావేశం బుధవారం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా రాసమల్ల రఘువీర్ సగర, కోశాధికారిగా అనిశెట్టి సతీష్ సగర ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా చింత ప్రభాకర్ సగర, నలుబాల శంకరయ్య సగర, కొల్లూరి సాంబయ్య సగర, అనిశెట్టి పరమేశ్వర్, శాతిరి కుమారస్వామి తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర, ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి బాబు, రాష్ట్ర నాయకులు అభినందించారు.




