05-02-2025 NORMAL NEWS 11:18 PM
swarnodayam.com
Telugu Daily News
05-02-2025 11:18 PM By Mandala Yadagiri

ప్రశాంతంగా కొనసాగిన ఢిల్లీ ఎన్నికలు

ప్రశాంతంగా కొనసాగిన ఢిల్లీ ఎన్నికలు
Oplus_131072

స్వర్ణోదయం ప్రతినిధి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 05:
ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠా త్మకంగా తీసుకున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగింపు దశకు వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకూ 57.70 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో అత్యధి కంగా 63.83 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా సౌత్ ఈస్ట్ ఢిల్లీలో 53.77 శాతం పోలింగ్ నమోదైంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, హర్దీప్ సింగ్ పురి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, అప్ సుప్రీం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సీజేఐ సంజీవ్ ఖన్నా, సీఈసీ రాజీవ్ కుమార్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. సీలాంపూర్, జాంగ్‌పుర, కస్తూర్బా నగర్‌లో నకిలీ ఓట్లు పోలవుతున్నాయంటూ ఆరోపణలు రావడంతో అధికారులు, పోలీసు యంత్రాంగం అప్రమత్తమ య్యాయి. పార్టీల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని నిర్ధారించ డంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆప్ సుప్రీం న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఆయనపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోటీ పడుతున్నారు. ఢిల్లీ

Oplus_131072
Oplus_131072

ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల..

పీపుల్స్‌ పల్స్‌: బీజేపీ 51-60, ఆప్‌ 10-19,

ఏబీపీ మ్యాట్రిజ్‌: బీజేపీ 35-40, ఆప్‌ 32-37,

ఆత్మసాక్షి: బీజేపీ 38-41, ఆప్‌ 27-30, కాంగ్రెస్‌ 1-3,

చాణిక్య స్ట్రాటజీస్‌: బీజేపీ 39-44, ఆప్‌ 25-28,

కేకే సర్వేలో బీజేపీ 22, ఆప్‌ 39,

ఢిల్లీ టౌమ్స్‌ నౌ: బీజేపీ 39-45, ఆప్‌ 22-31.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!