06-02-2025 NORMAL NEWS 09:35 AM
swarnodayam.com
Telugu Daily News
06-02-2025 09:35 AM By Mandala Yadagiri

మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం

మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం
Oplus_131072

:మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎల్ఎండి కాలనీలోని మిషన్ భగీరథ ప్రధాన పంపుహౌస్ లోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ మరమ్మత్తు పనుల కారణంగా మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగునని హుజురాబాద్ మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.రామ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు గురువారం రోజున ఉదయం 10:00 నుండి 07.02.2025 శుక్రవారం సాయంత్రం 5:00 వరకు మరమ్మత్తు పనుల కారణంగా నీటి సరఫరాలో అంతరాయం కలుగునన్నారు.
రెండు రోజులు ఆయా గ్రామాల ప్రజలు స్థానిక నీరు ఉపయోగించుకోవాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు సహకరించాలని హుజురాబాద్ మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.రామ్ కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!