06-02-2025 NORMAL NEWS 02:05 PM
swarnodayam.com
Telugu Daily News
06-02-2025 02:05 PM By Mandala Yadagiri

గురుకులంలో పదవ తరగతి విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్.

గురుకులంలో పదవ తరగతి విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల(బాలుర)గురుకుల విద్యాలయంలో(సైదాపూర్ శాఖ) పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆఖ్యారపు రాణి మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయుటకు టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయని, ప్రతి సంవత్సరము ఈ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడులు ఇవ్వడము, టాలెంట్ టెస్టులు నిర్వహించడం అభినందనీయమన్నారు. మధురమ్మ ట్రస్ట్ చేసే సేవ కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం మంచి ప్రతిభ కనబరిచిన మొదటి నలుగురు విద్యార్థులకు బహుమతులను ప్రిన్సిపాల్ ఆఖ్యారపు రాణి చేతుల మీదుగా ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) బహుమతులు అందజేశారు. బహుమతులు పొందిన కే అశ్వదు, ఎం అరవింద్, ఏ సిద్ధార్థ, జి వినాయకు లకు శంకర్ నారాయణ డిక్షనరీలు మరియు మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజెపి అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!