06-02-2025 NORMAL NEWS 02:22 PM
swarnodayam.com
Telugu Daily News
06-02-2025 02:22 PM By Mandala Yadagiri

కాంగ్రెస్ తోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం… ప్రశ్నించే గొంతుకలు కాదు – పరిష్కరించే నాయకులు కావాలి. – కాంగ్రెస్ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కాంగ్రెస్ తోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం… ప్రశ్నించే గొంతుకలు కాదు – పరిష్కరించే నాయకులు కావాలి. – కాంగ్రెస్ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
IMG_20250206_141833

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీతోనే ఉద్యోగ నిరుద్యోగ పట్టబద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని కరీంనగర్ అదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి వూటుకూరి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు…గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కళాశాల మైదానం, బతుకమ్మ ఘాట్, కార్గిల్ లేక్, ఇంద్ర పార్క్, రాజీవ్ నగర్ స్టేడియంవాకర్స్ తో ముఖాముఖి సమావేశం నిర్వహించి రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్యే ప్రచారంలో భాగంగా తాను ఉమ్మడి నాలుగు జిల్లాలలో పర్యటించడం జరిగిందని, చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని తన పర్యటనలో వచ్చిన సమస్యలు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. పట్టభద్రులకు ప్రశ్నించే గొంతులు అవసరం లేదని సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న నాయకులు కావాలని వెల్లడించారు. విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న తనకు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను యువత ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యేడాది కాలంలోనే నిరుద్యోగ యువతకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చి వారికి భరోసా కల్పించారని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ యాజమాన్య కళాశాల ప్రతినిధి ఊటుకూరు రవీందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా వీఎన్నార్ టీం ఇంచార్జ్ మాసం రత్నాకర్ పటేల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, సంగీతం శ్రీనివాస్, గోలి వెంకటరమణ, వేల్పుల తిరుపతిరెడ్డి, విఎన్ఆర్ టీం సభ్యులు సభ్యులు ఆనందం, కనపర్తి జగదీశ్వర్, తోపుల శ్రీనివాస్, సుద్దాల శ్రీనివాస్, రాజు, మల్లేశం, మడుపు ప్రవీణ్ రెడ్డి, యేసు రత్నం, గోనె ఎల్లప్ప, కల్లూరు చందన తదితర నాయకులు పాల్గొన్నారు.

Oplus_131072 వాకర్స్ తో వాకింగ్ చేస్తున్న విఎన్ఆర్
Oplus_131072 వాకర్స్ ను పరిచయం చేసుకుంటూ ఓటు అభ్యర్థిస్తున్న నరేందర్ రెడ్డి

వాకర్స్ కు అభివాదం చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!