06-02-2025 NORMAL NEWS 02:56 PM
swarnodayam.com
Telugu Daily News
06-02-2025 02:56 PM By Mandala Yadagiri

తృటిలో తప్పిన ప్రమాదం.. ఓవర్టేక్ చేయబోయి బస్సును ఢీ కొట్టిన లారీ.. డివైడర్ ను ఢీ కొట్టి ఆగిన ఆర్టీసీ మినీ బస్సు. – 40 మంది ప్రయాణికులు క్షేమం.

తృటిలో తప్పిన ప్రమాదం.. ఓవర్టేక్ చేయబోయి బస్సును ఢీ కొట్టిన లారీ.. డివైడర్ ను ఢీ కొట్టి ఆగిన ఆర్టీసీ మినీ బస్సు. – 40 మంది ప్రయాణికులు క్షేమం.
IMG_20250206_144003

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్డులో ఓ ఆర్టీసీ మినీ బస్సు తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. మినీ బస్సును ఓవర్టేక్ చేయబోయిన లారీ బస్సును వెనక నుండి ఢీ కొట్టడంతో ఆర్టీసీ మినీ బస్సు టీఎస్ 23 0002 నంబరు గల బస్సు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీ కొట్టి ఆగింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా వారు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మినీ బస్సు మాత్రం ముందు భాగం నుజు నుజ్జు కావడంతో డ్రైవర్ రవీందర్ పోలీసులను ఆశ్రయించారు. లారీ డ్రైవర్ ఎండి జలీల్ నిర్లక్ష్యం వల్లే ఆర్టీసీ బస్సు వెనకాల తగిలి బస్సు డివైడర్ కు ఢీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. అంతేకాక లారీ డ్రైవర్ లారీ యూనియన్ నాయకులను పిలిపించి బస్సు డ్రైవర్ ని బెదిరించేందుకు ప్రయత్నించగా పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!