Social 1080×1350 • Multi-page
06-02-2025 BREAKING NEWS 05:36 PM
swarnodayam.com
Telugu Daily News

కెజీబీవీ పదవ తరగతి విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్.

కెజీబీవీ పదవ తరగతి విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్.
IMG-20250206-WA0136

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (ఎల్కతుర్తి): ఈనెల 28న జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ అనితదేవి మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయుటకు టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయని, అనంతరం మంచి ప్రతిభ కనబరిచిన మొదటి నలుగురు విద్యార్థులకు బహుమతులను స్పెషల్ ఆఫీసర్ అనితదేవి చేతుల మీదుగా ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) బహుమతులు అందజేశారు. బహుమతులు అందుకున్న వారిలో వి కీర్తన, ఈ శ్వేతబిందు, బి హనీ, ఎం అలేఖ్యలకు శంకర్ నారాయణ డిక్షనరీలు మరియు మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయినీలు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!