Social 1080×1350 • Multi-page
07-02-2025 BREAKING NEWS 02:58 PM
swarnodayam.com
Telugu Daily News

నాగార్జున డైరీలో సిబ్బందికి వైద్య పరీక్షలు.

నాగార్జున డైరీలో సిబ్బందికి వైద్య పరీక్షలు.
IMG_20250207_145142

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని నాగార్జున డైరీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు నాగార్జున డైరీ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. డైరీలోని అన్ని విభాగాల సిబ్బందికి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రసాద్ రావు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా నాగార్జున డైరీ డైరెక్టర్ పుల్లూరి గణేష్ రావు మాట్లాడుతూ డైరీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కూడా తమ కుటుంబ సభ్యులుగా భావించి వారి యోగ క్షేమాలు చూసుకునే బాధ్యత కూడా మాపై ఉంటుందన్నారు. సిబ్బందికి ప్రతి సంవత్సరం ఇలాగే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. తమ డైరీలో పనిచేసే ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున డైరీ డైరెక్టర్ సతీమణి శృతి, ఏజీఎం ఆకునూరి సుధాకర్, ప్లాంట్ మేనేజర్ మాటూరు శ్రీనివాస్, మెయింటెనెన్స్ మేనేజర్ సంతోష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!