Social 1080×1350 • Multi-page
07-02-2025 BREAKING NEWS 05:46 PM
swarnodayam.com
Telugu Daily News

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిచి… సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇస్తాను… -కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిచి… సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇస్తాను… -కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి
IMG_20250207_173952

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదములు తెలియజేశారు. కాంగ్రెస్ నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీన రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నానని తెలిపారు. భారీ ఎత్తున ర్యాలీ చేపట్టబోతున్నామని చెప్పారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించిందని కొనియాడారు. పార్టీ పథకాలతో పాటుగా నరేంద్రుడి నవరత్నాలు పేరిట మేనిఫెస్టోతో పట్టభద్రుల వద్దకు చేరుకోబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, సన్నిహితులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!