07-02-2025 NORMAL NEWS 06:35 PM
swarnodayam.com
Telugu Daily News
07-02-2025 06:35 PM By Mandala Yadagiri

కాంగ్రెస్ తోనే న్యాయవాదుల సమస్యల పరిష్కారం..అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు కృషి.. -పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి

కాంగ్రెస్ తోనే న్యాయవాదుల సమస్యల పరిష్కారం..అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు కృషి.. -పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి
IMG_20250207_183250

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (సుల్తానాబాద్): న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.. శుక్రవారం సుల్తానాబాద్ పట్టణం లో పలువురు పట్టభద్రులను న్యాయవాదులను కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..న్యాయవాదుల చిరకాల వాంఛ అయిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు తన వంతుగా కృషి చేస్తానని వెల్లడించారు… తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అద్భుతంగా ముందుకు వెళ్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 55 వేల ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. నాలుగు నెలల ఎమ్మెల్సీ పర్యటనలో చాలా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని.. వాటన్నిటిని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తనపై ఉందని గుర్తు చేశారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తుందని గుర్తు చేశారు. తాను రాజకీయాలు చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేయడం లేదని కేవలం నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు.

Oplus_131072 న్యాయవాదుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి విఎన్ఆర్
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!