Social 1080×1350 • Multi-page
10-02-2025 BREAKING NEWS 12:10 AM
swarnodayam.com
Telugu Daily News

పీవీకి భారతరత్న ఇచ్చి ఏడాది పూర్తయినందున ఘనంగా వేడుకలు

పీవీకి భారతరత్న ఇచ్చి ఏడాది పూర్తయినందున  ఘనంగా వేడుకలు
IMG_20250210_000703

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న ప్రకటించిన రోజును పురస్కరించుకుని పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించి స్వీట్స్ పంచి పెట్టారు. స్థానిక పివి సేవా సమితి, సిద్ధార్థనగర్ కాలని అధ్యక్షులు సాగి వీరభద్రరావ్, తూము వెంకటరెడ్డిలు ముందుగా పివి చిత్రపటానికి పూలమాల వేసి ..పివి పై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పివి ఈ దేశానికి అందించిన విశిష్ట
సేవలను ప్రజలకు గుర్తు చేశారు. బహుభాషా కోవిధుడుగా, అపర చానిక్యూనిగా వారికి ఉన్న రాజకీయ అనుభవంతో ఈ దేశానికి ఎనలేని సేవ లందించారని అన్నారు. వారిని భారతరత్నతో గౌరవించడం తెలుగు వారికి గర్వకారణం అని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు బి.మనోజ్, డా. తోగరు విద్యాసాగర్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు వేల్పులరత్నం, పీడీ రాజిరెడ్డి, సబ్బని శివాజీతో పాటు సీడ్స్ సంపత్ రావ్, వి.ప్రభాకర్, పసుల స్వామి, యు రాజమౌళి, గౌరి శంకర్, నమశ్శివాయ, సుధాకర్ గౌడ్, కె.అనిరుద్ రెడ్డి, ముక్కెర కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!