Social 1080×1350 • Multi-page
10-02-2025 BREAKING NEWS 08:54 AM
swarnodayam.com
Telugu Daily News

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో నలుగురి అరెస్ట్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో నలుగురి అరెస్ట్
IMG_20250210_084915

స్వర్ణోదయం ప్రతినిధి (తిరుమల -తిరుపతి):

లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో నలుగురిని సీబీఐ దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వారిలో భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) నాడు డైరెక్టర్లుగా పని చేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ(పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఏఆర్ డైరీ(దుండిగల్) ఎండీ రాజు రాజశేఖరన్‌లు అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. క్రైమ్ నెంబర్ 470/24లో అరెస్ట్ చేసి తిరుపతి కోర్టులో హాజరు పరిచారు.

ఏఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు.. ఏఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ కథ నడిపిన వైష్ణవి డైరీ.. రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించారు. భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థం లేదని అధికారులు తమ విచారణలో తేల్చి చెప్పారు. ఏది ఏమైనాపటిక కల్తీ నెయ్యి విషయం సంచలనంగా మారగా నలుగురిని ఎట్టకేలకు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

కల్తీ నెయ్యి వ్యవహారంలో అరెస్టు అయిన నలుగురు వ్యక్తులు విరే.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!