Social 1080×1350 • Multi-page
10-02-2025 BREAKING NEWS 10:39 AM
swarnodayam.com
Telugu Daily News

ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో అత్యుత్తమ పర్ఫార్మర్ అవార్డ్ ని అందుకున్న సత్యరాజ్

ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో అత్యుత్తమ పర్ఫార్మర్ అవార్డ్ ని అందుకున్న సత్యరాజ్
IMG-20250210-WA0133

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత గంపా నాగేశ్వర్ రావు స్థాపించిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ బంధం రావూరి ల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో అత్యుత్తమ పెర్ఫార్మెర్ అవార్డ్ ని హుజురాబాద్ కి చెందిన జర్నలిస్ట్ చిలుకమారి సత్యరాజ్ అందుకున్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 189వ బ్యాచ్ ట్రైనింగ్ హైదరాబాద్ లోని మినర్వా గ్రాండ్ స్టార్ హోటల్లో రెండు రోజుల పాటు నిర్వహించారు. అందులో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్పించారు. ఈ ట్రైనింగ్ లో సత్యరాజ్ అత్యుత్తమ పెర్ఫార్మర్ గా అవార్డును, అలాగే సర్టిఫికెట్ ను ప్రముఖ మెజీషియన్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డర్ చొక్కాపు వెంకటరమణల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సహకరించిన ఇంచార్జి కేవి సురేష్ కుమార్, త్రినాధ్ దాసరి, మెంటార్ శ్రీనిధి, కో ఆర్డినేటర్ మోహన్ పాటిల్ లకు, అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ బంధంరావూరి, గురువు ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వర్ రావులకు ప్రత్యేక కృతజ్ఞతలకు తెలిపారు. గత 28 సంవత్సరాలుగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఉచితంగా ఎన్నో వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఆయన కూడా తన వంతు సహకారంగా ప్రభుత్వ స్కూల్స్ లలో స్టూడెంట్స్ కి ఉచిత సేవలు అందించి సమాజానికి సేవ చేస్తానని సత్యరాజ్ తెలియజేశారు. కాగా సత్యరాజ్ అవార్డు అందుకోవడం పట్ల పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Oplus_131072 వర్క్ షాప్ లో పర్ఫామెన్స్ ఇస్తున్న సత్యరాజ్
Oplus_131072
Oplus_131072 అవార్డు అందుకుంటున్న సత్యరాజ్

కంపా నాగేశ్వరరావు తో సత్యరాజ్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!