Social 1080×1350 • Multi-page
10-02-2025 BREAKING NEWS 11:39 AM
swarnodayam.com
Telugu Daily News

మహాకుంభమేళకు పోటెత్తిన భక్తజనం… – భారీగా ట్రాఫిక్ జామ్!

మహాకుంభమేళకు పోటెత్తిన భక్తజనం… – భారీగా ట్రాఫిక్ జామ్!
IMG_20250210_121630

స్వర్ణోదయం ప్రతినిధి, ప్రయగ్ రాజ్, ఫిబ్రవరి10:
మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తుతుంటంతో ప్రయాగ్‌రాజ్‌ చేరుకునే అన్ని రోడ్డు మార్గాల్లో సోమవారం కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 25 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్థంభించిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రయాగ్‌రాజ్‌కు దారి తీసే వారణాసి, లక్నో, కాన్పూర్‌, రేవా మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే ఏడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ను 20 కిలోమీటర్ల ముందే నిలిపివేస్తున్నారు. దీంతో పుణ్య స్నానాలాచరించే సంగమ ప్రాంతానికి వెళ్లేందుకు భక్తులు కనీసం 20 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని తెలిసింది. రద్దీని నియంత్రించేందుకు అధికారులు మధ్యప్రదేశ్‌లోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. కనీసం 50 వేల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. 48 గంటలుగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయామని భక్తులు చెబుతున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారి కోసం అధికారులు తాగునీరు, ఆహారంతో పాటు తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 14 వరకు ప్రయాగ్‌రాజ్‌ సంగం రైల్వేస్టేషన్‌ను మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!