Social 1080×1350 • Multi-page
10-02-2025 BREAKING NEWS 12:35 PM
swarnodayam.com
Telugu Daily News

మోడల్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్

మోడల్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్
IMG_20250210_123005

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు సైదాపూర్ మండలంలోని సోమవారంలో గల మోడల్ స్కూల్ నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోమవారం సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన మొదటి ఐదుగురు విద్యార్థులకు బహుమతులను ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్( రిటైర్డ్ టీచర్ ) ప్రిన్సిపాల్ డాక్టర్ బి సంపత్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ప్రభుత్వ సెక్టార్ లో చదువుతున్న విద్యార్థులందరికీ పరీక్ష ప్యాడులు అందించడం, టాలెంట్ టెస్టులు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అంతేకాక మధురమ్మ మెమోరియల్ ట్రస్టు పేదలకు చేస్తున్న సామాజిక కార్యక్రమాలను వెలకట్టలేమని తెలిపారు. అనంతరం మంచి ప్రతిభ కనబరిచిన మొదటి ఐదుగురు విద్యార్థులు ఏ అనిత, ఏ అంజలి, పి మణికంఠ, పి కుసుమాంజన్, డి జగన్ లకు బహుమతులుగా శంకర్ నారాయణ డిక్షనరీలు మరియు మెమొటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బండి కుమార్, ఎన్ రాజేశం, జి మనోజ్ కుమార్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!